TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రచ్చబండ విన్నపాలకు చెదలు

Published on: Sat Mar 3, 2012 2:14PM

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన రచ్చబండ కార్యక్రమం అభాసుపాలవుతుంది. రచ్చబండ సందర్భంగా వచ్చిన లక్షలాది విన్నపాల్లో కొన్ని ఇప్పటికే చెదలపాలయ్యాయి. విన్నపాల్లో పదోవంతు సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రెండుసార్లు రచ్చబండ కార్యక్రమం నిర్వహించగా దాదాపు 50 లక్షల వినతి పత్రాలు వచ్చాయి. గత ఏడాది జనవరి 24 నుంచి  ఫిబ్రవరి 12 వరకు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమలో వచ్చిన వినతులన్నింటినీ కంప్యూటర్లలో ఫీడ్ చేశారు. రెండోసారి నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో దాదాపు  25 లక్షల వినపత్రాలు అధికారులకు అందాయి. మొదటి వినతి పత్రాలను పరిష్కరించినా, పరిష్కరించకపోయినా కనీసం కంపూటర్లలో నమోదు చేశారు. రెండోసారి వినపత్రాలకు అ భాగ్యం కూడా దక్కలేదు. కట్టలు కట్టలుగా వాటిని రెవెన్యూ కార్యాలయాల్లో పడేశారు. వాటిల్లో కొన్ని వినపత్రాలు చెదలకు ఆహారంగా మారాయి. దీనిపై రెవెన్యూశాఖ కార్యదర్శులను వివరణ అడిగితే కంప్యూటర్లలో వీటిని త్వరలోనే నమోదు చేయిస్తామని తెలిపారు. సిబ్బంది కొరత కారణంగా రెండవ విడత వినతి పత్రాల నమోదు కార్యక్రమం ఇంకా ప్రారంభించలేదని వివరించారు.