TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్ర పరిస్థితిపై సోనియా ఆరా!

Published on: Fri Dec 23, 2011 9:20AM

న్యూఢిల్లీ: రాష్ట్ర పరిస్థితిపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరా తీశారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పనితీరుపై  కూడా ఆమె ఆరా  తీసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటూ ఆమె ప్రాథమిక విద్యా మంత్రి శైలజానాథ్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితి బాగానే  ఉందని, పార్టీని బలోపేతం చేయడానికి ఇదే సరైన సమయమని, రాహుల్ గాంధీ నాయకత్వంలో తాము బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన సోనియాతో చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను ప్రోత్సహించి.. సామాజిక న్యాయం అమలు చేసేందుకు కూడా ఇదే మంచి సమయమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కిరణ్ ప్రభుత్వం సాఫీగా నడుస్తోందని, శాంతిభద్రతలు మెరుగయ్యాయని, అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం ప్రవేశపెట్టారని సోనియాకు ఆయన వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై ఒక రహస్య నివేదికను ఆయన సోనియాకు అందించినట్లు తెలిసింది.