అంచనాల కమిటీ చైర్మన్ గా వేగుళ్ల

posted on: Nov 22, 2024 12:05PM

అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల కోనసీమ జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును రా ష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గా నియమించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ పదవి ద్వారా వేగుళ్లకు క్యాబినెట్ హోదా దక్కుతుంది. కాగా అంచనాల కమిటీ చైర్మన్ గా వేగుళ్ల పేరు ఖరారైంది. ఈ మేరకు వేగుళ్లకు ప్రభఉత్వం నుంచి సమాచారం కూడా అందింది.  తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చిన వేగుళ్ల జోగేశ్వరరావు 2004 ఎన్నికలలో అప్పటి ఆలమూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2009 ఎన్నికలు వచ్చే సరికి నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఆలమూరు నియోజకవర్గం మాయమై.. మండపేట నియోజకవర్గం ఏర్పడింది.

2009 ఎన్నికలలో మండపేట నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన వేగుళ్ల విజయం సాధించారు. అక్కడ నుంచి వరుసగా 2009, 2014, 2019, 2024 ఎన్నికలలో వేగుళ్ల విజయం సాధించారు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన వేగుళ్లకు చంద్రబాబు ఈ సారి కేబినెట్ లో చోటు కల్పిస్తారని అంతా భావించారు. అయితే సమీకరణాల కారణంగా వేగుళ్లకు కేబినెట్ లో స్థానం దక్క లేదు. అయితే పార్టీకి వేగుళ్ల సేవలను గుర్తించిన చంద్రబాబు ఇప్పుడు ఆయనకు అంచనాల కమిటీ చైర్మన్ గా అవకాశం ఇచ్చి కేబినెట్ హోదా కల్పించారు.  వేగుళ్లకు 2009 నుండి అనేక కమిటీల్లో సభ్యుడుగా వేగుళ్లకు పని చేసిన అనుభవం ఉంది

google-ad-img
    Related Sigment News
    • Loading...