TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్‌కు ఎన్నికల కలవరం

Published on: Thu Aug 16, 2012 10:49AM

రాష్ట్రంలో 2014 లో జరిగే ఎన్నికలకోసం కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పటికే భయం పట్టుకుంది. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చతి పార్టీశ్రేణులను, సిట్టింగ్‌ ఎంపి, ఏమ్మేల్యేలనూ గందరగోళానికి గురిచేస్తున్నాయి. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే రానున్న ఎన్నికల్లో గెలవటం కష్టమని వారు వాపోతున్నారు. ఇదే ఆవేదనను వాయిలార్‌ రవి ఎదుట వ్యక్తంచేశారు.ఆయన వారి ఆందోళనతో ఏకీభవించి మార్పు తీసుకొస్తానని హామీ ఇవ్వడం కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులే కొనసాగితే 2014 లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ అడిగే వారు కూడా ఉండరని సీనియర్లు కలవరపడుతున్నారు.


 

పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో రవిని రాష్ట్రానికి సంబంధించిన కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు కలిసి మాట్లాడారు.  పిచ్చాపాటీ అయినా మన రాష్ట్ర వ్యవహారాలపై సీరియస్‌గానే చర్చలు జరిగాయి.రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నట్లు పలువురు ప్రస్తావించారు.జగన్‌ పార్టీని అణచివేసే వూహ్యాలు, నాయకులు కనిపించడం లేదని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.



ఒకవైపు జగన్‌, మరోవైపు తెలంగాణ సమస్య పార్టీని ఆందోళనకు గురి చేస్తుందని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని వారు రవిని కోరారు. రాష్ట్రంలో పదవులు తీసుకొనే ముందు చేసిన వాగ్ధానాలను కిరణ్‌, బొత్స మరిచారని కూడా తెలిపారు. ఆలస్యం చేసేకొద్దీ పార్టీకి నష్టం అని స్వయంగా వాయిలార్‌ రవి తెలపటంవల్ల ఆధిష్టానంలో కూడా అదేభావన ఉందని దీన్ని బట్టి కిరణ్‌కుమార్‌ను, బొత్సను తొలగించడం జరుగుతుందని పార్టీ వర్గాల వారు తెలిపారు.