TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వేయడానికి వేలు తీయడానికి వందలు

Published on: Sat Oct 20, 2012 12:14PM

State Car Owners, Problems, Side Glasses, Black Film, Remove, One Week, Illegal Works, Police Orders, Transport Department, Police Department, Understanding, Request

 

రాష్ట్రంలోని కారు యజమానులందరికీ పెద్ద చిక్కొంచిపడింది. అదేమంటే కార్ల సైడ్ అద్దాలకు ఉన్న బ్యాక్ ఫిలింని తీయించడానికి వారం రోజులే ఉండటం.  కారుల్లో ఎటువంటి చట్టవ్యతిరేక చర్యలు జరుపుతున్నా కనబడటం లేదని అందువల్ల వాహన దారులు వాటిని తొలగించాలని పోలీసులు ఉత్తర్యులు జారీ చేయడమే ఇందుకు కారణం. కొద్దిరోజులు మాత్రమే గడువు వుండటంతో నాలుగు చక్రాల వాహక చోదకులంతా బ్లాక్ ఫిలింలను తీయడానికి గానూ షాపులముందు పడిగాపులు పడవలసి వస్తుందని వారు వాపోతున్నారు. దానిని వేయించడానికి వేలు ఖర్చు పెట్టామని అయితే పోలీసు వారి హెచ్చరికల మేరకు వాహన దార్లు వాటిని తీయించడానికి వందలు గుంజుతున్నారని ఆగ్రహిస్తున్నారు. ముందుగానే రవాణా శాఖ, పోలీసు శాఖ  ఒక అవగాహనకు వచ్చి వుంటే తమకు  మేలుగా ఉండేదని, సమయమూ,, డబ్బూ రెండూ ఆదా అయ్యేయని వాహనదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు