కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్‌

 

సీమాంద్రలో నిరసన సెగలు ఎగసి పడుతున్నా కేంద్ర మాత్రం రాష్ట్ర ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. ఈ నేపధ్యంలోనే వీలైనంత త్వరగా కేబినెట్‌ నోట్‌ రేడీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ నోట్‌ తయారు చేయటంలో హైదరాబాద్‌ అంశమే కీలకంగా మారనుంది.

అయితే ఇప్పటి వరకు హైదరాబాద్‌ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చేయాలన్న ఆలోచన ఉన్న కేంద్రానికి, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయటం కరెక్ట్‌ అన్న వాదన హోం శాఖ వినిపించే అవకాశాలున్నాయంటున్నారు.

ఈ మేరకు జాతీయ మీడియా ఇప్పటికే వార్త కథనాలను కూడా ప్రసారం చేసింది. ఇన్నాళ్లు హైదరాబాద్‌ను తెలంగాణకు రాజధానిగా కొనసాగించాలని భావించినా ప్రస్థుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితులతో కేంద్రం పునరాలోచనలో పడిందంటున్నారు. దీంతో పాటు ఆంద్ర ప్రాంతానికి విజయవాడ, లేదా విశాఖపట్నంలలో ఒకదానిని రాజధానిగా ప్రతిపాదించనున్నారు.