TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

30న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు ఎఐవైఎఫ్‌

Published on: Sun Dec 25, 2011 8:22AM

హైదరాబాద్‌: నిరుద్యోగులపట్ల ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ డిసెంబర్‌ 30న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్‌) పిలుపునిచ్చింది. ఎస్‌ఐ పోస్టులకు వయోపరిమితి 25 నుంచి 28 సంవత్సరాలకు, వీఆర్‌ఓ, వీఆర్‌ఏ, గ్రూప్‌-1, 2 జూనియర్‌ లెక్చరర్లు, డిగ్రీ కళాశాల లెక్చరర్లు ఇతర పోస్టులన్నింటికీ వయోపరిమితిని 34 నుంచి 39 ఏళ్లకు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు చేపట్టనున్నట్లు ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల వార్డెన్‌ పోస్టుల నియామకానికి నిర్వహించిన రాత పరీక్షలను రద్దుచేసి, వాటిని ఎపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి వారు డిమాండ్‌ చేశారు.