వైసీపీ తరుపున సినీ హీరో ప్రచారం?

 

సినిమాలు వేరు, రాజకీయాలు వేరు.. కానీ సినిమాలకి, రాజకీయాలకి విడదీయరాని సంబంధం ఉంది.. సినిమా హీరోలు, రాజకీయాల్లోకి రావడం.. రాజకీయ వారసులు, సినిమా హీరోలు అవ్వడం కామన్.. అందుకే సినిమాలు, రాజకీయాలు ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాయి.. రాజకీయ నాయకులు కూడా సినిమా వాళ్ళతో ప్రచారం చేపిస్తే, వాళ్ళ ఫాలోయింగ్ వల్ల ఓట్ల శాతం పెరుగుతుందని నమ్ముతారు.. ఆ నమ్మకంతోనే సినిమా వాళ్ళని ఎన్నికల సమయంలో రంగంలోకి దింపుతారు.. ఇప్పుడు ఇదే ఫార్ములాని వైసీపీ ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది.. ఎన్నికలు సమీపిస్తున్నాయి..

పాదయాత్రల పేరుతో జనాల్లో తిరిగితే సరిపోదు, జనాలకి దగ్గరవాలంటే ఏదైనా చేయాలని ఆలోచిస్తున్న వైసీపీకి, సినిమా వాళ్ళతో ప్రచారం అనే పాత ఫార్ములా తట్టిందట.. ఫార్ములా పాతదైనా పార్టీకి కొత్త ఉత్సాహం వస్తదని నమ్ముతున్నారట.. ఇప్పటికే పోసాని కృష్ణ మురళి, థర్టీ ఇయర్స్ పృథ్వి లాంటి వారు వైసీపీకి మద్దతుగా నిలిచారు.. పోసాని అయితే ప్రెస్ మీట్లు పెట్టి మరి బాబు మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు..

వీరికి తోడు ఇంకొందరు సినిమా వాళ్ళు వైసీపీకి మద్దతుగా నిలిస్తే పార్టీకి మైలేజీ పెరుగుతుందని భావిస్తున్నారట.. ముఖ్యంగా హీరోలని రంగంలోకి దింపాలని చూస్తుందట.. దానిలో భాగంగానే తెలుగువాడు అయ్యుండి తమిళ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశాల్ ని, వైసీపీ తరుపున ప్రచారం చేయించాలని చూస్తున్నారట.. మరి నిజంగానే విశాల్, వైసీపీ తరుపున ప్రచారం చేస్తారా? ఒకవేళ చేస్తే వైసీపీకి ఏమన్నా ప్లస్ అవుతుందా? తెలియాలంటే కొంతకాలం ఎదురుచూడాల్సిందే.