TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాహుల్ పాదయాత్రలో తొక్కిసలాట.. మహామాజీ మంత్రికి గాయాలు

Published on: Wed Nov 2, 2022 2:43PM

రాహుల్ గాంధీ పాదయాత్రలో తొక్కిసలాట జరిగింది. హైదరాబాద్ నగరంలో రెండో రోజు పాదయాత్రలో భాగంగా చోటు చేసుకున్న స్వల్ప తొక్కిసలాటలో మహారాష్ట్ర మాజీ మంత్రి నితిన్ రౌత్ గాయపడ్డారు. హైదరాబాద్ లో రెండో రోజు పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బుధవారం (అక్టోబర్ 2) గాంధియన్ ఐడియాలజీ సెంటర్ నుంచి ప్రారంభమైంది.

\రాహుల్ ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చసేందుకు జనం పోటీలు పడుతున్నారు. పెద్ద సంఖ్యలో జనం రాహుల్ గాంధీతో అడుగు కలిపి నడిచేందుకు ఉత్సాహపడుతున్నారు. యాత్ర ఉత్సాహంగా సాగుతూ కుకట్ పల్లి చేరుకుంది. అక్కడ ఓ కేఫ్ లో టీ తాగిన రాహుల్ విద్యార్థులతో కొద్ది సేపు ముచ్చటించారు.

మదీనా గూడెంలో లంచ్ విరామం తీసుకున్నారు. రాత్రికి ముత్తంగి చేరుకుంటారు. కాగా ఈ పాదయాత్రలో పాల్గోన్న మహారాష్ట్ర మాజీ సీఎం నితిన్ గౌర్ తొక్కిసలాటలో చిక్కుకుని గాయపడ్డారు.   రాహుల్‌ తో కలిసి నడుస్తుండగా జరిగిన తోపు లాటలో..  రౌత్ గాయపడ్డారు. ఆయన కంటికి, చేతులు, కాళ్లకు  గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు.