TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబు సభలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి

Published on: Wed Dec 28, 2022 8:00PM

కందుకూరు చంద్రబాబు సభలో ఘోర విషాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం (డిసెంబర్ 28) చంద్రబాబు సభకు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. కందుకూరు సభా స్థలి పక్కనే పక్కనే కాలువ ఉండటంతో కొందరు కార్యకర్తలుఅందులో పడిపోయారు.

సంఘటన గురించి తెలియగానే చంద్రబాబు ప్రసంగం ఆపివేసి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.  . చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందనీ, మృతుల పిల్లల చదువు బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుందనీ చెప్పారు. తొక్కసలాటలో కార్యకర్తల మరణం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.