TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ తో భేటీపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు.. ఊహించని ట్విస్ట్

Published on: Tue May 14, 2019 3:09PM

 

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌.. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో నిన్న సమావేశమమైన విషయం తెలిసిందే. అయితే.. ఈ భేటీపై స్టాలిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్రంట్‌ ఏర్పాటు చర్చల కోసం కేసీఆర్‌ చెన్నై రాలేదని, దైవ దర్శనాల కోసమే వచ్చారని వ్యాఖ్యానించారు. ఈక్రమంలోనే తనను మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పారు. ఇక.. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌, బీజేపీయేతర ఫ్రంట్‌ ఏర్పాటుకు ఎలాంటి అవకాశాలూ లేవని స్టాలిన్‌ అన్నారు.

ఫెడరల్‌ ఫ్రంట్‌ కి మద్దతివ్వాలని కేసీఆర్ కోరగా.. స్టాలిన్ తిరస్కరించారని వార్తలొచ్చాయి. అంతేకాదు ఇంకా మీరే తమ కూటమికి మద్దతివ్వాలని స్టాలిన్ కేసీఆర్ ని కోరినట్లు కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో స్టాలిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరి నిజంగానే స్టాలిన్, కేసీఆర్ మధ్య ఫ్రంట్ గురించి చర్చ జరగలేదా? ఒకవేళ జరిగినా తనకు ఇష్టం లేకపోవడంతో స్టాలిన్ ఆ టాపిక్ పక్కన పెట్టారా? అసలేం జరిగిందో కేసీఆర్, స్టాలిన్ కే తెలియాలి.