నేటి నుండే ఎస్.ఎస్.సి. పరీక్షలు ...

 

శుక్రవారం ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.00 వరకు ఎస్.ఎస్.సి. పరీక్షలు ప్రారంభంకానున్నాయి.హైదరాబాద్ జిల్లాకు మాసాబ్ ట్యాంక్ బిఇడి కాలేజ్ ప్రిన్సిపాల్ ఎం.రాధారెడ్డి, రంగారెడ్డి జిల్లాకు ఆర్.ఎం.ఎస్.ఎ. జేడీ రాఘవేందర్ రాఘవేందర్ పరిశీలకులుగా నియమితులయ్యారు. వీరిద్దరూ పరీక్షల నిర్వహణపై గురువారం అధికారులతో సమీక్ష జరిపారు. జంటనగరాల్లోని 784 కేంద్రాలలో 1.75 లక్షలమంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. హైదరాబాద్ జిల్లా నుండి 81,867 మంది విద్యార్థులు, రంగారెడ్డి జిల్లా నుంచి 93,777మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అన్ని వసతులు ఉన్న పాఠశాలలానే పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.