Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అనుష్క త్రిషలపై జక్కన్న ప్రశంసలు
posted on: Aug 21, 2015 4:44PM

జక్కన్న రాజమౌళి చెక్కిన బాహుబలి సినిమా ఘన విజయం సాధించి రికార్డులు బద్దలు కొట్టింది. అయితే ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 కోసం ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 40 శాతం షూటింగ్ పూర్తయిందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే మళ్లీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి కొంత సమయం పట్టనున్న నేపథ్యంలో రాజమౌళి ఏం చేస్తున్నారో తెలుసా అన్ని సినిమాల వైపు ఓ లుక్కెస్తున్నట్టున్నారు. ఏ సినిమాలు వున్నాయ్.. ఎవరెవరు ఎలా చేస్తున్నారు అని బాగా పరిశీలిస్తున్నట్టున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు రెండు సినిమాలు బాగా నచ్చాయంట. సైజ్ జీరో సినిమాలో లావుగా, డీగ్లామర్ గా అనుష్క పాత్ర.. అలాగే నాయకి సినిమాలో త్రిష పాత్రలు బాగా నచ్చాయంట. అంతేకాదు ఈ సినిమాలకి సంబంధించి ట్వీట్టర్ లో పోస్టులు కూడా చేశాడు . సైజ్ జీరో సినిమాలో అనుష్క చాలా చక్కగా ఉందని.. ఇంకా నాయకి పాత్రలో అయితే త్రిష ఒక చేత్తో కత్తి.. ఒక చేత్తో పూజా సామాగ్రి పట్టుకొని చాలా బావుందని.. ఈ రెండు సినిమాల పోస్టర్లు చూస్తుంటేనే ఆసక్తి కలుగుతుందని ట్వీట్స్ చేశాడు. మరి జక్కన్నకే ఈ సినిమాలు అంత బాగా నచ్చాయంటే మరి ప్రేక్షకులకు ఎంత బాగా నచ్చుతాయో చూడాలి.






