జక్కన్న చంద్రన్నతో కలిస్తే..అద్భుతమేగా..?

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచంలోని గొప్ప నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలని..అలనాటి అమరావతికి ఏ మాత్రం తీసిపోని స్థాయిలో నిర్మించాలన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు కల. అందుకోసం రాజధానిని ప్రకటించిన నాటి నుంచి ప్రపంచంలోని ప్రసిద్ధ నగరాలను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అంతేకాకుండా నగరానికి మంచి వాస్తు బలం ఉండాలనే ఉద్దేశ్యంతో దేశంలోని ప్రముఖ వాస్తు పండితులను పిలిపించి పక్కా ప్రణాళికతో నిర్మాణాలకు ఆమోదం తెలిపారు ముఖ్యమంత్రి.

 

అలాగే సృజనాత్మకత, చక్కటి అభిరుచి ఉన్న కొందరి సేవలను కూడా అమరావతి నిర్మాణానికి వినియోగించుకోవాలనుకున్న చంద్రబాబు..అందమైన ఆలోచనల్ని వెండితెరపై ఆవిష్కరించగల ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి సలహాలు తీసుకోవాలని నిర్ణయించారు. బాహుబలి విషయంలో జక్కన్న తన కమిట్‌మెంట్ నిరూపించుకున్నాడు. ఆయన ఆహ్వానం మేరకు రాజమౌళి ఇవాళ అమరావతిని సందర్శించారు. ఉదయం సీఎంను కలిసి భేటీ అవ్వగా..రాజధాని నిర్మాణాలు ఎలా ఉండాలన్న విషయంలో చంద్రబాబు తన ఆలోచనలను పంచుకున్నారని..ఆయన దూరదృష్టి తనకు ఎంతో నచ్చిందని తప్పకుండా అమరావతికి నా సేవలు అందజేస్తానని చెప్పారు.

 

ఇక్కడో విషయం చెప్పాలి..చంద్రబాబు పని రాక్షసుడు..పని యంత్రం..నిద్రాహారాలు లేకపోయినా పని ఉంటే చాలు..ఓ పనిని అందరికంటే బెస్ట్‌గా చేసి రోల్ మోడల్‌గా నిలబడాలనే కసి ఉన్న నాయకుడు..తాను చేపట్టిన పని బెస్ట్..ఇక తిరుగులేదు అని సంతృప్తి పొందేవరకు విడిచిపెట్టడు. అలాంటి వ్యక్తికి అచ్చం అలాంటి పని రాక్షసుడు రాజమౌళి దొరికితే ఇంకేమైనా ఉందా..పర్ఫెక్ట్‌గా పని జరిగే వరకు ఇద్దరు కాంప్రమైజ్ అవ్వరు. సో అమరావతి భవనాలు ముందు తరాల వారికి ఒక నమూనాగా..తెలుగుజాతి కిర్తీకిరిటంలో ఒక కలికితురాయిగా నిలిచిపోతుందనడంలో ఆశ్చర్యం లేదు.