TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీశైలం డ్యామ్‌పై ఆక్టోపస్ బృందం మాక్ డ్రిల్

Published on: Sun Aug 24, 2025 3:00PM

 

నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యామ్ పై  ఆక్టోపస్ యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్ టీమ్ అత్యాధునిక ఆయుదాలతో రాత్రుల సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి చిమ్మ చీకటిలో దట్టమైన కొండల నడుమ ఉన్న శ్రీశైలం డ్యామ్ పై ఆక్టోపస్ పోలీసు బలగాలు మోహరించి మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆక్టోపస్ ఏపి మంగళగిరి డీఎస్పీ రంగబాబు ఆద్వర్యంలో 38  మంది ఆక్టోపస్ టీమ్ ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. 

శ్రీశైలం డ్యామ్ బద్రత  తీవ్రవాదుల కదలికలు గమనిస్తూ అనుకోకుండా డ్యామ్ పై చొరబడితే వారి చెర నుంచి అధికారులను వ్యక్తులను ఎలా కాపాడుకోవాలనే ఆంశంపై  తీవ్రవాదుల చర్యలను ఎలా ఎదురుకోవాలనే ప్రక్రియను రియల్ గా అత్యాదునిక ఆయుదాలతో చాకచక్యంగా ఉగ్రవాదులను ఎలా మట్టు పెట్టాలి, వారి నుంచి ఎలా బయటపడాలనే ప్రక్రియ అత్యద్భుతంగా ఉత్కంట వాతావరణంలో హైటెంక్షన్ పరిస్దితుల ప్రక్రియ మాక్ డ్రిల్ ను ఆక్టోపస్ పోలీసు బలగాలు నిర్వహించారు.

శ్రీశైలం డ్యామ్ ఘాట్ రోడ్డు సమీపంలోని వ్యూపాయింట్ నుంచి కొండలు గుట్టలు దిగుచూ చీకట్లో అర్ధరాత్రి వరకు ఆక్టోపస్ పోలీసు బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించగా శ్రీశైలం డ్యామ్ పరిసరాలు మొత్తం చికటి వాతావరణం నిశబ్దమైన వాతావరణంలో ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్, శ్రీశైలం టూటౌన్ ఎస్ఐ సుబ్బారెడ్డి  తమ పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.