TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీరామ్ ఎంట్రీకి సమయం రాలేదు : పరిటాల సునీత

Published on: Tue Jan 24, 2012 8:13AM

అనంతపురం: రాజకీయాల్లోకి ప్రవేశించడానికి శ్రీరామ్‌కు ఇంకా సమయం రాలేదని తెలుగుదేశం శాసనసభ్యురాలు పరిటాల సునీత చెప్పారు.రేపు పరిటాల రవీంద్ర ఏడో వర్ధంతి సందర్భంగా ఆమె  మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తన కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశంపై ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని   ఆమె అన్నారు. శ్రీరామ్ ప్రస్తుతం చదువుకుంటున్నాడని, చదువును పూర్తి చేయాల్సి ఉందని ఆమె అన్నారు. శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశంపై కుటుంబ సభ్యులం చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు.పరిటాల రవి సేవా ట్రస్టు కార్యక్రమాల్లో శ్రీరామ్ ప్రస్తుతం చురుగ్గా పాల్గొంటున్నారని, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆమె అన్నారు. రాకీయాల్లోకి రావాలనే నిర్ణయమే తీసుకోనప్పుడు శ్రీరామ్ శాసనసభకు పోటీ చేస్తాడా, పార్లమెంటుకు పోటీ చేస్తాడనే విషయం ప్రస్తావనకే రాదని ఆమె అన్నారు. తమ కుటుంబం మొదటి నుంచి పేదల పక్షాన ఉందని, అందులో భాగంగానే శ్రీరామ్ తమ ఇంటికి వచ్చేవారిని కలుసుకుంటున్నారని ఆమె అన్నారు.