శ్రీనివాస్‌ది జాత్యాహంకార హత్యే-ట్రంప్
Published on: Wed Mar 1, 2017 9:31AM
.jpg)
శ్రీనివాస్ కూచిభోట్ల హత్యపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తుండటంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. శ్రీనివాస్‌ది జాతి వివక్షతో కూడిన హత్యేనని అన్నారు. ఇవాళ వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన ఇలాంటి దాడులకు అమెరికాలో చోటు లేదన్నారు..దేశ పౌరులను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఈ సందర్భంగా కేన్సస్ కాల్పుల ఘటన బాధితులకు అమెరికా కాంగ్రెస్ సంతాపం ప్రకటించింది. ఇటీవల కేన్సస్‌లోని ఓ బార్‌లో శ్వేత జాతీయుడు జరిపిన కాల్పుల్లో తెలుగు ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభోట్ల అక్కడికక్కడే మరణించగా..మరో తెలుగు యువకుడు అలోక్ రెడ్డి, దుండగుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇయాన్ గ్రిలాట్ అనే అమెరికన్ తీవ్రంగా గాయపడ్డారు.


