TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్‌కు చేరుకున్న శ్రీనివాస్ కూచిభోట్ల మృతదేహం

Published on: Tue Feb 28, 2017 9:28AM

అమెరికాలో జాత్యాంహర దాడికి గురై ప్రాణాలు కోల్పోయిన తెలుగు ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభోట్ల మృతదేహం హైదరాబాద్‌కు చేరుకుంది. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో రాత్రి 10.26 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అనంతరం ఆయన భౌతిక కాయానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పులమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి మృతదేహాన్ని అంబులెన్స్‌లో రాత్రి 11.30 గంటలకు అతని స్వగృహానికి తీసుకువచ్చారు. విగత జీవిగా ఉన్న శ్రీనివాస్‌ని చూడగానే కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. మధ్యాహ్నం శ్రీనివాస్ అంత్యక్రియలు జరగనున్నాయి.