TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీలంక అధ్యక్షుడు రాజీనామా

Published on: Mon Jul 11, 2022 2:27PM

ప్రజాగ్రహం మహామహులనే దహించేసింది. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్షే ఎంత. గొటబాయ రాజీనామా చేసే వరకూ అధ్యక్ష భవనం వీడేది లేదని ఆందోళనకారులు భీష్మించారు. శనివారం నుంచీ అధ్యక్ష భవనంలోనే తిష్ట వేశారు. వారి ఆగ్రహానికి తలవంచి అధ్యక్ష పదవికి గొటబాయ దిగివచ్చి రాజీనామా చేయడానికి అంగీకరించారు.  

బుధవారం అంటే ఈ నెల 13న తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అంతకు ముందే ప్రధాని విక్రమ సింఘేకు ఈ విషయం తెలియజేశారు. అంతకు ముందే స్వీకర్ మహీంద్రయాపాకు కూడా తెలియపరిచారు. కాగా ఇప్పటికే అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ప్రధాని విక్రమ సింఘే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి కారణం గొటబాయ రాజపక్సే అతిని సోదరులే కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి విదితమే. ఆరోపణలు వెల్లువెత్తినా, ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటున్నా ఇంత కాలం రాజీనామాకు ససేమిరా అంటున్న రాజపక్సే ఎట్టకేలకు ప్రజాగ్రహ జ్వాలలకు తలవంచారు. రాజీనామాకు అంగీకరించారు.

అధ్యక్షుడి రాజీనామా ప్రకటన తరువాత శ్రీలంకలో పరిస్థితులు క్రమంగా కుదుటపడే దిశగా సాగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. రాజపక్స రాజీనామా ప్రకటన తరువాత అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు అఖిలపక్షం సుముఖత వ్యక్తం చేసింది. తదుపరి ప్రధాని, అధ్యక్షుడు ఎవరన్న దానిపై చర్చలు సాగిస్తున్నారు. శ్రీలంక స్వతంత్ర్య దేశంగా ఆవిర్భవించిన తరువాత ఇంతటి ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవడం ఇదే ప్రథమం.