శ్రీకాంత్ క్షత్రియ పాటలు విడుదల
Published on: Thu Nov 21, 2013 10:46AM

శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "క్షత్రియ". కె.ఉదయచందు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేందర్, జయేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. విశ్వ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇటివలే హైదరాబాద్ లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి డి.రామానాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ లు ముఖ్య అతిధులుగా విచ్చేసారు. "శ్రీకాంత్ కోసమే నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. దర్శక నిర్మాతలు నాకు బాగా తెలుసు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని డి.రామానాయుడు అన్నారు. భరద్వాజ మాట్లాడుతూ... శ్రీకాంత్ ఎన్ని సినిమాలు చేసిన కూడా ప్రతి సినిమాను మొదటి సినిమా చేస్తున్నట్లుగానే చేస్తాడు. అదే అతడి ఉన్నతికి కారణం" అని అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ.. కథ చాలా నచ్చింది. థ్రిల్లర్ తరహాలో సాగే సినిమా ఇది. విశ్వ చక్కటి సంగీతం అందించాడు." అని అన్నారు.


