TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విద్యాకేంద్రంగా శ్రీకాకుళం జిల్లా: చంద్రబాబు

Published on: Thu Sep 18, 2014 5:04PM

 

శ్రీకాకుళం జిల్లాను విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేశారు. గురువారం ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. శ్రీకాకుళం జిల్లా పతివాడలో ఎన్టీఆర్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. స్థానిక ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాకుళం జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి వుందని, శ్రీకాకుళం జిల్లాను విద్యాకేంద్రంగా తీర్చిదిద్ది జిల్లా రుణం తీర్చుకుంటానని చంద్రబాబు అన్నారు.