వలసల బాటలో శ్రీకాకుళం మత్య్సకారులు
Published on: Tue Feb 21, 2012 10:27AM
శ్రీకా
కుళం జిల్లా: శ్రీకాకుళం జిల్లా మత్య్సకారులు వలసల బాటలు పడుతున్నారు. సముద్రంలో చేపల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం విదేశీ ట్రాలర్లు, మరబోట్లతో వీరు పోటి పడలేకపోవడంతో ఆదాయం బాగా తగ్గిపోయింది. పూర్తిస్థాయిలో పనుల్లేక పోవడంతో పిల్లాపాలతో వీరు పస్తులు ఉండాల్సి వస్తుంది. ఈ బాధ తట్టుకోలేక వారు ముంభై, చెన్నై, గోవా, అండమాన్, ఇరావన్, గుజరాత్ వంటి సుదూర ప్రాంతాలకు వలస పోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 60 వేల మత్య్సకార కుటుంబాలున్నాయి. 196 కిలోమీటర్ల తీరప్రాంతంలో 11 మండలాల్లో 110 మత్య్సకార గ్రామాలున్నాయి. రెక్కాడితేగాని డొక్కాడని మత్య్సకారులు నేటికీ సాంప్రదాయ పద్దతిలోనే వేట సాగిస్తున్నారు. అయితే ఈ దంగంలోకి పెద్ద పెద్ద సంస్థలు ప్రవేశించి మర పడవలతో చేపలు వేటాడుతున్నారు. దీనికి తోడు బర్మా, శ్రీలంక, థాయ్ లాండ్, ఫిలిప్పీస్ వంటి దేశాలకు చెందిన పెద్ద పెద్ద నౌకలు మన సముద్ర జలాల్లో అప్రయంగా ప్రవేశించి ఉన్న చేపలను ఊడ్చుకువెళ్ళిపోతున్నాయి. దీనితో సాంప్రదాయ పద్ధతిలో చేపలు వేటాడుతున్న శ్రీకాకుళం మత్య్సకారులకు చేపలు దొరకడం లేదు. ఫలితంగా వారు పస్తులతో అలమటించాల్సి వస్తోంది.


