TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీకాకుళం జిల్లాలో సబ్సిడీ బియ్యం దోపిడి

Published on: Tue Feb 21, 2012 10:23AM

    నెలకు రూ.30 లక్షల వరకు వినియోగదారులకు నష్టం   
శ్రీకాకుళం:  పేదలకోసం ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ బియ్యాన్ని అవినీతి పందికొక్కులు మింగేస్తున్నాయి. ప్రతినెలా సగటున మూడులక్షల కిలోల బియ్యం మాయమవుతున్నాయి. దీని విలువ సుమారు రూ.30లక్షలు. అయితే ఈ వ్యవహారం జరుగుతున్నది. ఎఫ్ సిఐ గోదాముల్లోనా, లేక మండలస్థాయి స్టాక్ పాయింట్లలోనా అన్నది తేలడం లేదు. రేషన్ డీలర్లు దగ్గరకొచ్చే సరికి 50 కిలోల బస్తాలో 1500 నుంచి 2000 గ్రాముల తరుగు కనిపిస్తోంది. ఆ నష్టాన్ని తామేందుకు భరించాలని డీలర్లు కూడా పెడదారి పడుతున్నారు. తూకాల్లో మోసాలకు పాల్పడి తరుగును సర్దుబాటు చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లాలో సుమారు ఏడు లక్షల తెల్లరేషన్ కార్డులున్నాయి. వీరికోసం ప్రతినెలా 10వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తోంది. బియ్యాన్ని 50 కిలోలకు ఒక బస్తా చొప్పున ప్యాక్ చేసి పౌరసరఫరాలకు చెందిన మండలస్థాయి స్టాక్ పాయింట్లకు ఎఫ్ సిఐ సరఫరా చేస్తోంది. ఈ మధ్యలో సుమారు మూడు లక్షల కిలోల తరుగు చోటుచేసుకుంటుంది. దోపిడీ ఎక్కడ జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అధికారులకు ఈ విషయం తెలిసినా స్పందించడంలేదు. అంతేకాక ఇది ఎప్పటినుంచో వున్న సమస్యేనంటూ దాటవేస్తున్నారు.