శ్రీకాకుళంలో పేట్రేగుతున్న గ్రావెల్ మాఫియా
Published on: Tue Feb 21, 2012 9:22AM
శ్రీకా
కుళం జిల్లా: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు, నందిగాం మండలాల్లో గ్రావెల్ మాఫియా పేట్రేగిపోతుంది. డి పట్టాభూముల్లో యధేచ్చగా కంకరను అక్రమంగా తవ్వుకుపోతుంది. రెవెన్యూ, మైన్స్ యంత్రాంగం కళ్ళుగప్పి రోజుకు సుమారు రూ.20 లక్షలను పైగా వీరు అక్రమార్జన చేస్తున్నారు. వాస్తవానికి డి పట్టాభూముల్లో కంకర తవ్వకాలు చేపట్టాలంటే తహసిల్దారు నుంచి భూ యాజమాన్య హక్కు ధృవపత్రం పొందాలి. అనంతరం పంచాయితీ స్పెషలాఫీసర్ అనుమతిలో భూగర్భ గనులశాఖ నుంచి ఎన్ ఓ సి తీసుకుని రాయల్టీ సొమ్మును ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే గ్రావెల్ మాఫియా ఇదేమీ చేయడం లేదు. స్థానికంగా ఉన్న రెవెన్యూ, అటవీ, మైన్స్ సిబ్బందికి మామూళ్ళు ముట్టజెప్పి కోట్లాది రూపాయల అర్జిస్తున్నారు. బెండికొండ విఎస్ ఎస్ లో అటవీశాఖ సుమారు మూడుకోట్ల రూపాయల వ్యయంతో నీలగిరి, అకేషియా చెట్లను పెంచుతోంది. అక్రమ కంకర తవ్వకాల వల్ల ప్రస్తుతం వీటి మనుగడకు కూడా ముప్పు వాటిల్లింది.


