అరసవల్లి లో ప్రత్యక్షమైన మంత్రి మోపిదేవి
Published on: Sun Feb 12, 2012 10:56AM
శ్రీ
కాకుళం: ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యదేవుడిని దర్శించుకుని, ఆదిత్యునికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తనకు గ్రహాల అనుకూలత లేకపోవడం వల్లనే సూర్యదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల మంత్రి మోపిదేవిపై మద్యం సిండికేట్ల విషయంలో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తనకు గ్రహాల అనుకూలత బాగా లేదని భావించి సూర్య దేవుడికి ప్రత్యేక పూజలు చేసినట్లున్నారు. అంతకుముందు మద్యం సిండికేట్లపై దాడులు జరిగినప్పుడు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఆదిత్యుడిని దర్సించుకున్నారు. బొత్స లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి కేసులో అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కూడా అరసవెల్లి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.


