పోస్టు మార్టం పూర్తి....సాయంత్రానికి భౌతికకాయం ముంబైకి..
Published on: Mon Feb 26, 2018 10:43AM
.jpg)
శ్రీదేవి మృతదేహానికి పోస్ట్ మాత్రం పూర్తయినట్టు యూఏఈకి చెంది ఖలీజా టైమ్స్ పేర్కొంది. తమ బంధువుల పెళ్లి నిమిత్తం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడే శనివారం రాత్రి తీవ్ర గుండెపోటుకు గురై.. బాత్ టబ్ లోనే తన తుదిశ్వాస విడిచారు. అయితే పోస్ట్ మార్టం చేయడం ఆలస్యం అవ్వడంతో శ్రీదేవి మృతదేహం ఇంకా భారత్ కు చేరుకోలేదు. అయితే ఈరోజు శ్రీదేవి పోస్టు మార్టం పూర్తయిందని యూఏఈకి చెంది ఖలీజా టైమ్స్ పేర్కొంది. పోస్టు మార్టం చేసిన శ్రీదేవి మృతదేహానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అందగానే బాడీ పాడవకుండా వైద్యులు ఎంబామింగ్ చేస్తారు. ఆ తరువాత వైద్యులు ఆమె మృతదేహాన్ని పోలీసులకు హ్యాండోవర్ చేస్తారు. వారు డెత్ సర్టిఫికెట్ ఇష్యూ చేసి, దానిని అక్కడి పబ్లిక్ ప్రాసిక్యూటర్ హ్యాండోవర్ చేసుకునేందుకు పర్మిషన్ ఇస్తారు. ఈ నిబంధనలు పూర్తయిన వెంటనే శ్రీదేవి మృతదేహాన్ని రిలయన్స్ కు చెందిన విమానంలో భారత్ కు తీసుకురానున్నారు. నేటి సాయంత్రానికి శ్రీదేవి భౌతికకాయం ముంబై చేరుకుంటుందని అంచనావేస్తున్నారు.


