TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీదేవి అంతిమ యాత్ర ప్రారంభం...

Published on: Wed Feb 28, 2018 1:47PM

 

శ్రీదేవి అంతిమ యాత్ర ప్రారంభమైంది. నిన్న రాత్రి ముంబై చేరుకున్న శ్రీదేవి భౌతియకాయాన్ని... ఈ రోజు ఉదయం 9.30 నుంచి అభిమానుల సందర్శనార్థం సెలబ్రేషన్‌ స్పోర్ట్స్‌ క‍్లబ్‌లో ఆమె మృతదేహన్ని ఉంచారు. దీంతో శ్రీదేవి భౌతిక కాయాన్ని కడసారి దర్శించుకునేందుకుగాను పెద్ద ఎత్తున తరలివచ్చారు. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌ సినీ ప్రముఖులు కూడా ఇప్పటికే ముంబై చేరుకుని నివాళులు అర్పించారు. అనంతంరం కుటుంబ సభ్యుల ప్రత్యే​క కార్యక్రమాల తర్వాత ఆమె అంతిమయాత్ర ప్రారంభమైంది. శ్రీదేవి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్టు మహారాష్ట్ర  ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పవన్ హన్స్ శ్మశానవాటికలో మధ్యాహ్నం 3.30 నిమిషాలకు శ్రీదేవి అంత్యక్రియలు జరుగనున్నాయి.