కడసారి చూపుకోసం తరలివస్తున్న అభిమానులు....
Published on: Wed Feb 28, 2018 9:19AM
.jpg)
అందాల తార శ్రీదేవి భౌతిక కాయం నిన్న రాత్రి ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే. ముంబైలోని లోఖండ్ వాలాలోని గ్రీన్ ఏకర్స్ లోని నివాసానికి శ్రీదేవి భౌతిక కాయాన్ని చేర్చారు. ఇక ఈ రోజు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే ఆమెను కడసారి చూసి నివాళులర్పించేందుకు అభిమానులు, పలువురు ప్రముఖులు ముంబైలోని ఆమె నివాసానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ప్రస్తుతం సెలెబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ కు ఆమె మృతదేహాన్ని తరలించారు. మధ్యాహ్నం 12:30 గంటల వరకు అక్కడ అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత 12:30 నుంచి 1:30 వరకు అక్కడే కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 2 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుండగా, 3:30 గంటలకు విల్లేపార్లేలోని సేవా సమాజ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి.


