TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీదేవి భౌతిక కాయం కుటుంబ సభ్యులకు అప్పగింత...

Published on: Tue Feb 27, 2018 3:08PM

 

ఎట్టకేలకు శ్రీదేవి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడి చనిపోయినట్టు ఫొరెన్సిక్ నివేదికతో పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు ఏకీభవించి....క్లియరెన్స్ లేఖ ఇచ్చారు. దీంతో శ్రీదేవి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంతేకాదు శ్రీదేవి కేసును క్లోజ్ చేసినట్టు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం... శ్రీదేవి మృతదేహానికి ఎంబామింగ్ కొనసాగుతున్నట్టు సమాచారం. కాగా సాయంత్రం 5 గంటలకు దుబాయ్ నుండి  బయలుదేరి.. రాత్రి 10 గంటలకు శ్రీదేవి మృతదేహం ముంబై చేరుకోనున్నట్టు తెలుస్తోంది.