చెన్నైపొన్ను రియల్ లైఫ్ స్టోరీ ఇంగ్లిష్ వింగ్లిష్
Published on: Mon Sep 3, 2012 4:33PM
ఇంగ్లిష్ వింగ్లిష్ తో మళ్లీ తెరమీదికొచ్చిన ముద్దుగుమ్మ శ్రీదేవి కొత్త సినిమాలో అంచనాలకు తగ్గట్టుగానే రాణించింది. శ్రీదేవి హిందీ చిత్రపరిశ్రమకు వెళ్లిన కొత్తలో భాష రాక ఆమె పడ్డ ఇబ్బందులమీదే ఈ స్టోరీని డిజైన్ చేసినట్టు బాలీవుడ్ వర్గాలు కోడైకూస్తున్నాయి. అప్పట్లో భాష అస్సలు అర్థంకాక శ్రీదేవి ఓ సహాయకుణ్ణికూడా నియమించుకుంది. ట్రైనర్ సాయంతో కొద్ది కాలంలోనే హిందీ తెగనేర్చేసుకుని ఆ తర్వాత బాలీవుడ్ ని ఏలేసిన సంగతి మళ్లీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీల్ లైఫ్ రెండో ఇన్నింగ్స్ లో రియల్ లైఫ్ స్టోరీని మిక్స్ చేసి చిలిపికళ్ల సోయగాలతో శ్రీదేవి మళ్లీ అభిమానుల్ని తెగ అలరించేసింది.


