పవన్ కు శ్రీరెడ్డి ప్రశ్న.. ఇరుకున పెట్టనుందా.?

 

ప్రశ్నిస్తానంటూ జనసేన పార్టీ పెట్టిన పవన్ ను శ్రీరెడ్డి ఓ ప్రశ్నతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది.. అన్న చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ప్రేమ వివాహం సమయంలో కాంగ్రెస్ నేతలు, కావాలనే జాతీయ ఛానల్స్ లో కూర్చోబెట్టి, మా కుటుంబ గౌరవాన్ని బజారుకు ఈడ్చాలని చూసారని.. పవన్ కాంగ్రెస్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.. ఈ విషయంపై సోషల్ మీడియా సాక్షిగా శ్రీరెడ్డి, పవన్ ను ప్రశ్నించింది.. 16 సంవత్సరాలు పెంచుకున్న పాపని కాంగ్రెస్ నాయకులు చీట్ చేసి ఢిల్లీలో నేషనల్ చానెల్స్ లో కూర్చోబెడితే మీ కడుపు ఉడికిపోతే.. మరి మీ అన్నయ్య చిరంజీవి ఇంకా కాంగ్రెస్ లోనే ఎందుకు కొనసాగుతున్నారు?.. ఆయన అభిమానుల ఓట్లు ద్వారా మీకు ఎందుకు సహాయం చేయాలనుకుంటున్నారు?.. ఆయనికి సిగ్గుగా అనిపించట్లేదా? ఒకరింట్లో అన్నం తిని ఇలా చేయడానికి అంటూ.. శ్రీరెడ్డి పవన్ ను ఘాటుగా ప్రశ్నించారు.