అశోక్‌గజపతిరాజుకు అవమానం
Published on: Tue Oct 22, 2013 12:12PM

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే, గజపతి రాజ వంశీయులు అశోక్‌గజపతిరాజుకు పైడితల్లి ఆలయంలో అవమానం జరిగింది. సిరిమానోత్సవం సందర్భంగా అశోక్గజపతి రాజు అమ్మవారిని దర్శించుకునేందుకు తన అనుచరులతో కలిసి గుడికి వెళ్లగా ఆయన అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన అశోక్‌గజపతిరాజు ఆలయం ఎదురుగా రోడ్డుపై బైఠాయించిన నిరసన తెలిపారు. దీంతో ఆలయ అధికారులు ఆయనను శాంతింపజేసి అనుచరులను ఆలయంలోకి అనుమతించడంతో పరిస్థితి సర్దుమణిగింది. మరోవైపు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడకు చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.


