నీచుల కోసం అమరుడైన పొట్టిశ్రీరాములు

Publish Date:Aug 19, 2013

Advertisement

 

 

 

ప్రస్తుత పరిస్థితి చూస్తే పొట్టిశ్రీరాములు స్వార్థపూరితమైన, నీచ రాజకీయ నాయకులూ, ఓట్ల కోసం అర్రులు చాచే కుష్టు బిచ్చగాళ్ళ కోసం తన విలువైన ప్రాణాలు అర్పించారేమో అనిపిస్తుంది. ఆ అమరజీవి శీలావిగ్రహాలను కూలదోస్తున్నారంటే అంత కంటే నీచమైన విషయం మరొకటి ఉండదు. రౌడీయిజం చేసి, హత్యలు చేసి రాజకీయ నాయకులైన వారి విగ్రహాలు మాత్రం అన్ని ఊళ్ళల్లో, ప్రతి సెంటర్ లో చెక్కు చెదరకుండా ఉంటాయ్. అదే మన దౌర్భాగ్యం.

 

తన ప్రాణాలను పణ౦గా పెట్టి సాధించిన తెలుగువారి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న డ్రామాలకు పై నుండి చూస్తే ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తుందో! ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించుదాం.