శ్రీలంకలో ఎమర్జెన్సీ!!

 

శ్రీలంకలో ఆదివారం జరిగిన బాంబు పేలుళ్ల తర్వాత అక్కడి ప్రభుత్వం అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని విధిస్తూ నిర్ణయం తీసుకొంది. ఇవాళ అర్ధరాత్రి నుండి  ఎమర్జెన్సీ అమల్లోకి  రానున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం శ్రీలంకలో జరిగిన 8 వరుస పేలుళ్లలో 290 మంది మరణించారు. మరో 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుళ్లలో 6 భారతీయ పౌరులు సహా 35 మంది విదేశీయులు చనిపోయారు. ఈ నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టుగా ఆ దేశం గెజిట్ నోటిఫికేషన్ విడుడల చేసింది. ఈ మేరకు ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కార్యాలయం మీడియాకు ప్రకటనను విడుదల చేసింది.