TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జయకు అవమానం: తమిళ సినీ పరిశ్రమ ధర్నా

Published on: Mon Aug 4, 2014 12:15PM

 

శ్రీలంక రక్షణ శాఖ వెబ్‌సైట్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా వ్యాసాన్ని రాయడమే కాకుండా జయలలిత నరేంద్రమోడీకి ప్రేమలేఖలు రాస్తున్నట్టుగా ఫొటో కార్టూన్ కూడా పోస్టు చేసిన సంఘటన తమిళనాడులో ఆందోళన కార్యక్రమాలకు కారణమైంది. జయలలిత మీద శ్రీలంక రక్షణ శాఖ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తమిళ చిత్ర పరిశ్రమ సోమవారం ధర్నాకు దిగింది. చెన్నైలోని శ్రీలంక కాన్సులేట్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ చిత్ర పరిశ్రమ ఆందోళన చేపట్టింది. ఈ అంశంలో శ్రీలంక రక్షణ శాఖ ఇప్పటికే క్షమాపణలు చెప్పింది.