TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాళేశ్వర్ ఆస్తులపై కన్నేసిన మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు

Published on: Mon Mar 19, 2012 2:57PM

ఇటీవల మరణించిన సాయికాలేశ్వర్ ఆశ్రమానికి చెందిన అపారమైన ఆస్తులపై రాష్ట్రానికి చెందిన మంత్రి, ముగ్గురు శాసనసభ సభ్యులు కన్నేసినట్లు తెలిసింది. ఈ నలుగురు రాజకీయ నాయకులు చాలాకాలంగా సాయికాళేశ్వర్ కు సన్నిహితంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో వీరి ప్రచార ఖర్చులకు సాయికాలేశ్వర్ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినట్లు తెలిసింది. సాయికాలేశ్వర్ బెంగుళూరు, చెన్నైలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసేవారని తెలిసింది. ఈ వ్యాపారాన్ని ఆయన ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి చేశారని కాళేశ్వర్ మరణంతో ఆయన వాటాను హస్తగతం చేసుకోవడానికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కాళేశ్వర్ ఆశ్రమానికి సుమారు 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల వ్యవహారంలో రాష్ట్రానికి చెందిన మంత్రి ఒకరు జోక్యం చేసుకుంటున్నారు. ఈ ఆస్తుల సెటిల్ మెంట్ పేరుతో ఆ మంత్రి తన వాటాకోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.