TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దుర్ముఖిలో పాత రేవంత్‌ బయటకొస్తాడా..?

Published on: Fri Apr 8, 2016 11:42AM

 
 
తెలుగు సంవత్సరాది సందర్భంగా ఈ ఏడాదైనా పాత సంవత్సరం కష్టాలు తీరతాయని కొండంత ఆశలతో ఎదురుచూస్తుంటారు ప్రజలు. అందుకు సామాన్యులు కూడా అతీతులు కాదు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డికి గత సంవత్సరం ఏమాత్రం కలిసిరాలేదు. ఎంతో ఎత్తుకు ఎదిగి వైకుంఠపాళిలో పాము నోట్లో పడినట్టు కిందకిపడిపోయాడు. అసెంబ్లీ సమావేశాల్లో తన దూకుడు స్వభావంతో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కే చెమటలు పోయించి టీడీపీ తరపున భావి ముఖ్యమంత్రి అభ్యర్థి తనే అన్నట్టు దూసుకెళ్లాడు.
 
 
అయితే ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లి వచ్చిన తర్వాత రేవంత్ కాస్త సైలెంయ్యారు. దానికి తోడు ఒకరి తర్వాత ఒకరు టీడీపీ ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం కప్పుకోవడంతో రేవంత్ ఒంటరిగా మిగిలిపోయారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాకపోవడం, సపోర్ట్ ఇచ్చే వాళ్లు లేకపోవడంతో ఆయన చప్పబడిపోయారు. మనం చూస్తుంది రేవంత్ రెడ్డినేనా అని అభిమానులు,ప్రజలు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే దుర్ముఖి నామ సంవత్సరంలో రేవంత్ మళ్లీ గర్జించాలని అనుకుంటున్నారు. అభిమానుల్లో ఫాలోయింగ్, వాగ్థాటి ఆయుధాలుగా చేసుకుని రేవంత్ దుమ్ములేపడానికి రెడీ అవుతున్నారు. తద్వారా పూర్వవైభవాన్ని తిరిగి సంపాదించాలనుకుంటున్నారు.