TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీశైలంనుంచి నీళ్లొదిలేస్తే రాజీనామా చేస్తా

Published on: Fri Aug 31, 2012 11:30AM

Spy reddy, srisailam dam, water, Krishna water, rayalaseema, emergency, nagarguna sagar, congress leaders, resignation, threat, high command, Kurnoolశ్రీశైలం డ్యామ్ నుంచి పెద్దఎత్తున నీటిని విడుదల చేయడాన్నినిరసిస్తూ రాజీనామా చేయాలని కర్నూలు ఎంపి ఎస్పీవైరెడ్డి నిర్ణయించుకున్నారు. ఐదువేల క్యూసెక్కులకంటే ఎక్కువనీటిని కిందికి వదిలేయడంవల్ల తమప్రాంతవాసులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ప్రజలకు అన్యాయం చేయొద్దని ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని ఎస్పీవై రెడ్డి అంటున్నారు. తనతోపాటు మరికొందరు రాయలసీమ నేతలుకూడా ప్రభుత్వ నిర్ణయంపై మనస్తాపంతో రాజీనామాకి సిద్ధంగా ఉన్నారని ఆయన చెబుతున్నారు. వరదనీటిని ముందుగా వెలుగోడు ప్రాజెక్ట్ నుంచి సీమకు తరలించాలని రాయలసీమ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరో నాలుగురోజులతర్వాత నీటిమట్టం కావాల్సిన మేరకు పెరుగుతుందని, అప్పుడు నీళ్లు కిందికి వదిలితే తమకు అన్యాయం జరగదని రాయలసీమ నేతలు చెబుతున్నారు.