TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్పోర్ట్స్‌ సెంటర్లలో లైంగిక వేధింపులు

Published on: Thu Jun 7, 2018 11:42AM

దేశానికి భవిష్యత్‌ క్రీడాకారుల్ని తయారుచేసే సంస్థలకి చెదలుపట్టింది. కోచ్‌ల వెకిలి వేషాలతో sports authority of India శిక్షణా శిబిరాలు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. అందుకు రుజువు. ఆ శాఖకి ఒకటి కాదు రెండు కాదు... మూడు రాష్ట్రాల నుంచి ఒకేసారి ఫిర్యాదులు అందాయి. తమని కోచ్‌లు లైంగికంగా వేధిస్తున్నారంటూ, అక్కడి మైనర్‌ బాలికలు మొరపెట్టుకున్నారు. తమిళనాడులో ఏకంగా 15 మంది బాలికలు కలిసి తమ కోచ్ మీద ఒక ఉత్తరాన్ని రాయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్పోర్ట్స్‌ అధారటీ వెంటనే కఠిన చర్యలకి ఉపక్రమించిందనుకోండి... కానీ మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఏ చర్యలు తీసుకుంటుందన్నదే ప్రశ్న!