TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజకీయ రాబందులు మాత్రమే మిగిలాయ్

Published on: Fri Aug 31, 2012 11:43AM

spirals, rabandulu, birds, not seen, dryup, political leaders, politics, dirty politicsరాబందులు అంతరించి పోయాయ్.. రాజకీయ రాబందులు మాత్రం రోజురోజుకీ పెరిగిపోతున్నాయ్.. నొప్పి, జ్వరం తగ్గడానికిచ్చే డైక్లోఫినాక్ పుణ్యమా అని రాబందుల జాతి అంతరించిపోయింది. ఎన్నిమందులేసినా రాజకీయరాబందులుమాత్రం, అంతకంతకూ బలంపుంజుకుంటూ దేశాన్ని దోచుకుతింటూనే ఉన్నాయ్. రాబందుని చూపిస్తే రెండు లక్షలు బహుమానమిస్తామంటూ జీవ వైవిధ్యమండలి ప్రకటించినా ప్రయోజనం లేకుండా పోయింది. రాజకీయ రాబందులకైతే రెండు లక్షలు మీరు ఇవ్వాల్సిన పనిలేదు. సీన్ లోకి ఎంటరైన పదినిముషాల్లో చకచకా అవి పనిచేసుకుపోతాయ్. స్పాట్ లో ఏమీ లేకుండా ఊడ్చిపారేస్తాయి. సుడిగాలిలా ఎంత స్పీడ్ గా వచ్చాయో.. అంతే స్పీడ్ గా పనిపూర్తికాగానే ఎగిరిపోతాయ్.. రోజురోజుకీ పెరిగిపోతున్న రాజకీయ రాబందుల్ని చూసి.. జనం భయపడుతున్నారు. ఎన్ని యుగాలు గడిచినా భూమ్మీద రాజకీయ రాబందుల మనుగడకు మాత్రం ఏమాత్రం ఢోకా లేదు.