Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...‘రాఘవ’ కాదు.. ‘రాక్షస’.. టీఆర్ఎస్ వేటు.. వేట మొదలైందా?
posted on: Jan 7, 2022 1:37PM
ఖమ్మం జిల్లాలో ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడుకు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఆయన కీచక పాత్ర ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆయనే వనమా రాఘవేందర్రావు. ఆత్మహత్య చేసుకుంటూ నాగ రామకృష్ణ విడుదల చేసిన సెల్ఫీ వీడియోతో రాఘవేందర్రావు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
వనమా రాఘవేంద్రరావు దౌర్జన్యాలు, కీచక పర్వాలు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తాజా సంఘటనలో.. ఆస్తి వివాదం పరిష్కరించాలని రాఘవను నాగ రామకృష్ణ ఆశ్రయించాడు. సమస్య పరిష్కారం కావాలంటే పిల్లలు లేకుండా నీ భార్యను హైదరాబాద్ లోని తన వద్దకు తీసుకు రావాలని రాఘవ చెప్పాడట. మరణ వాంగ్మూల సెల్ఫీ వీడియోలో నాగ రామకృష్ణ ఈ సంగతి పేర్కొనడంతో తీవ్ర సంచలనంగా మారింది. నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య సంఘటనపై రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. ఎమ్మెల్యే వనమా ఇంటి వద్ద ధర్నాలు, ఆందోళనలు చేశాయి. దీంతో రాఘవేందర్ రావు ఇంటి నుంచి పరారయ్యాడు. కుటుంబం ఆత్మహత్య సంఘటన రాజకీయరంగు పులుముకోవడంతో హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి రాఘవ 1991లోనే అప్పటి స్పాంజ్ ఐరన్, ఇప్పటి ఎన్ఎండీసీ ఫ్యాక్టరీ కార్మిక సంఘం ఎన్నికల సందర్భంగా చర్ల చిట్టయ్యను కిడ్నాప్ చేసి, హతమార్చి గోదావరి నదిలో పడేశాడన్న ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అయితే.. ఆ కేసులో రాఘవ నిర్దోషిగా బయటపడ్డాడు. అప్పటి నుంచీ రాఘవ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. 1993లో ఎన్ఎండీసీ సమీపంలో ఒక వ్యక్తికి శిరోముండనం చేయించాడనే ఆరోపణలు కూడా రాఘవ ఎదుర్కొన్నాడు. ఆ సంవత్సరమే ఓ అత్యాచార యత్నం కేసులో కూడా రాఘవ ఇరుక్కోవడం గమనార్హం. అయితే.. ఇలాంటి అరాచకాలను రాఘవ తన తండ్రి రాజకీయ పలుకుబడితో వెలుగులోని రానివ్వకుండా చేశాడని స్థానికులు చెప్పుకుంటారు. ఎవరు, ఎక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినా రాఘవ కోరిన భూమి ఇచ్చేయాలట. ఎక్కడ అభివృద్ధి పనులు చేసినా తనవారు, ఇతరులు అనే తేడా లేకుండా రాఘవకు ముడుపులు ముట్టజెప్పాల్సిందేనట.
అధికారులు, మహిళా ఉద్యోగుల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడనే ఆరోపణలూ రాఘవపై ఉన్నాయని చెప్పుకుంటారు. 25 ఏళ్ల క్రితం పాల్వంచలో ఉద్యోగం చేసిన ఓ పోలీసు భార్యపై రాఘవ అత్యాచారానికి తెగబడితే.. ఆ పోలీసు ఆత్మాభిమానంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడనే ఆరోపణపై రాఘవను 2013లో అప్పటి ఏఎస్పీ భాస్కర్ భూషణ్ అరెస్టు చేసి, పలు కేసులు కూడా నమోదు చేశారు. తండ్రి వనమా 2019లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచీ నియోజకవర్గంలో రాఘవే షోడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యే పెత్తనం అంతా రాఘవే చేస్తున్నాడంటూ ఆరోపణలు వస్తున్నాయి.
ఇక భూదందాలు, సెటిల్మెంట్లు, ప్రైవేట్ పంచాయితీల విషయంలో రాఘవ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. నవభారత్ ప్రాంతంలో సంవత్సరం క్రితం భూ ఆక్రమణ కేసులో ఒక గిరిజన మహిళపై దాడిచేసిన ఘటనలో రాఘవపై కేసు నమోదైంది. జిల్లా మంత్రి ఆ గిరిజన మహిళకు అండగా నిలిచినా.. రాఘవ తన పలుకుబడి ఉపయోగించి కేసును బుట్టదాఖలు చేయించాడంటారు. ఇక 2021 జూలైలో ఫైనాన్సియర్ వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు రాఘవ బెదిరింపులే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రాఘవపై కేసు నమోదైంది. దాంతో పరారైపోయి.. ముందస్తు బెయిల్ తో తిరిగి వచ్చాడు. ఇప్పుడు కూడా నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవ ప్రధాన నిందితుడు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కేసీఆర్ ఆదేశాలతో టీఆర్ఎస్ పార్టీ అతనిపై వేటు వేసింది. ఇక వేట మొదలైనట్టేనా?


.webp)
.webp)


