ప్రత్యేక హోదాపై కేంద్రం హామీ: కంభంపాటి
Published on: Wed Sep 24, 2014 6:23PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీలైనంత త్వరగా ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్ స్పష్టమైన హామీ ఇచ్చారని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు తెలిపారు. బుధవారం నాడు ఆయన కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుతో కలసి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లులో పొందుపరచిన అంశాలను ఈ సందర్భంగా కంభంపాటి రామ్మోహన్రావు మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. పరిశ్రమలకు రాయితీలు, ప్రత్యేక ప్యాకేజీల మీద చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు మిగతా అన్ని విషయాల మీద సంబంధిత శాఖ కార్యదర్శులతో చర్చించి సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టమైన హామీ ఇచ్చారని కంభంపాటి రామ్మోహన్రావు తెలిపారు.


