TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గాన గంధర్వుడు ఎస్పీ80వ జయంతి.. చంద్రబాబు ఘన నివాలి

Published on: Thu Jun 4, 2026 10:26AM

 

తన మధుర గాత్రంతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన దిగ్గజ గాయకుడు, పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా బాలుకు ఘన నివాళులర్పించారు.  ఈ విశ్వంలో తెలుగు భాష ఉన్నంత కాలం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గళం వినిపిస్తూనే ఉంటుందని, ఆయన సంగీత ప్రియుల గుండెల్లో ఎల్లకాలం జీవించే ఉంటారని చంద్రబాబు పేర్కొన్నారు.  

బాలు గొంతు కేవలం పాట మాత్రమే కాదు,  అది సంగీత ప్రపంచానికి జరిగిన ఒక గొప్ప అభిషేకంగా చంద్రబాబు అభివర్ణించారు. స్పీబాలసుబ్రహ్మణ్యం మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికీ, ఆయన సృష్టించిన స్వరాల సామ్రాజ్యం నిత్యం మనల్ని పలకరిస్తూనే ఉంటుందని సీఎం చంద్రబాబు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.  

కాగా బాలు 80వ జయంతి సందర్భంగా అభిమానులు, సంగీతకారులు దేశవ్యాప్తంగా ఎంతో వినూత్నంగా వేడుకలను నిర్వహిస్తున్నారు.  ఆయన జ్ఞాపకార్థం  ఎస్పీబీ.. ఎయిటీ టు ఎటర్నిటీ  పేరిట ఒక అద్భుతమైన డిజిటల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ బాలు పాడిన  మధురమైన రేర్ సాంగ్స్‌ను విడుదల చేస్తూ శ్రోతలకు సరికొత్త అనుభూతిని పంచుతున్నారు. మరోవైపు చెన్నైలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన  ది మ్యూజిక్ అకాడమీ వేదికగా బాలు స్మరణార్థం ఒక భారీ సంగీత విభావరి కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు.

తరాలు మారుతున్నప్పటికీ ఎస్పీబీ స్వర మాధుర్యం ఇప్పటికీ ప్రతి ఒక్కరినీ మైమరపిస్తూనే ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాలుతో ఉన్న అవినాభావ సంబంధాన్ని, వారి గుండెల్లో ఆయన సంపాదించుకున్న చెరగని స్థానాన్ని ఈ జయంతి వేడుకలు మరోసారి ప్రపంచానికి ఘనంగా చాటిచెబుతున్నాయి.