ప్రధాని చెంప చెళ్ళుమంది...

 

ప్రధానమంత్రి అంతటివాడి చెంప చెళ్ళుమంది. స్పెయిన్ ప్రధాని మరియానో రజోయ్ మీద ఒక టీనేజ్ కుర్రాడు చెయ్యి చేసుకుని చెంప చెళ్ళుమనిపించాడు. రజోయ్ ఓ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ వుండగా అక్కడే వున్న ఒక టీనేజ్ కుర్రాడు ఆయన చెంప మీద బలంగా కొట్టాడు. దాంతో ప్రధాని కళ్ళజోడు ఎగిరి అవతల పడింది. ఊహించని ఈ ఘటనతో ప్రధాని దిగ్భ్రాంతికి గురయ్యాడు. అక్కడున్నవాళ్ళందరూ చేష్టలుడిగి చూస్తూ వుండిపోయారు. ప్రధాని భద్రతా సిబ్బంది ఆ బాలుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.