Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం...ఇద్దరు యువతుల అరెస్ట్
posted on: Dec 27, 2025 6:25PM

స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారమందుకున్న బద్వేలు అర్బన్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి స్పా సెంటర్ పై దాడి చేసి ఇద్దరు యువతుల తోపాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని నెల్లూరు రోడ్ బైపాస్ సర్కిల్ వద్ద గత ఏడాదిగా స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు.
స్పా సెంటర్ లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు బద్వేలు అర్బన్ ఎస్ఐ సత్యనారాయణ తన సిబ్బందితో కలసి అర్ధరాత్రి తర్వాత స్పాసెంటర్‌పై దాడి చేసి, అక్కడవున్న ఇద్దరు యువతులుతోపాటు,ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
కాగాపోలీసులు అదుపులోకి తీసుకున్న యువతులను మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించి,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ నుంచి యువతులను బద్వేల్‌కు రప్పించి నాలుగు నెలలుగా ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టణ పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.






