TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అసలు దొంగ ఎస్పీ సల్వీందర్ సింగేనా.. ?

Published on: Thu Jan 7, 2016 4:26PM

పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రదాడి కేసులో అందరి అనుమానాలు గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ పైనే ఉన్నాయి. అయితే ఎన్ఐఏ విచారణలో బయటపడుతున్న విషయాలను బట్టి చూస్తే ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. సల్వీందర్ సింగ్ పై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో వెలువడిన విషయాలను చూస్తే నిజమనే అనిపిస్తుంది ఎవరకైనా. ఎన్ఐఏ దర్యాప్తులోసల్వీందర్ సింగ్ తాను తరుచుగా పంజ్ పీర్ దర్గాకు వెలుతుంటానని చెప్పారు. కానీ దర్గా అధిపతి సోమ్ మాత్రం తాను ఎప్పుడూ సల్వీందర్ సింగ్ ను చూడలేదని, డిసెంబర్ 31వ తేదిన మొదటి సారి చూశానని చెప్పారు. అంతకు ముందు ఎన్నడూ ఆయన ఈ దర్గా దగ్గరకు రాలేదని, ప్రార్థనలు చెయ్యలేదని అధికారులకు సమాచారం ఇచ్చారు.

అంతేకాదు దీనికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు కూడా తెలియజేశారు. డిసెంబర్ 31 వ తేదిన ఉదయం ఎస్పీ మిత్రుడు.. అతని వంటవాడు దర్గాకు వచ్చి కొంచెంసేపు గడిపి వెళ్లారని.. అదేరోజు రాత్రి సల్వీందర్ సింగే స్వయంగా ఫోన్ చేసి దర్గాను తెరిచి ఉంచాలని కోరారని చెప్పారు. అయితే తాను దర్గా మూసేసే టైమ్ అయిందని చెప్పినా సల్వీందర్ సింగ్ ఊరుకోలేదని..తెరచి ఉంచాల్సిందేనని ఆదేశించారని అన్నారని తెలియజేశారు. దీంతో సిల్విందర్ సింగ్ పై అనుమానాలు మరింత పెరిగాయి. మరోవైపు సల్వీందర్ సింగ్ పై ఐఎస్ఐ అమ్మాయిల ఎర వేసిందన్న దిశలో కూడా విచారించగా సల్వీందర్ సింగ్ ఐఎస్ఐ హనీ ట్రాప్ లో పడినట్టు ఎన్ఐఏ తెలుపుతోంది. అంతేకాదు సల్వీందర్ సింగ్ గతంలో లేడి కానిస్టేబుళ్లను కూడా లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

అయితే ఈ కేసులో ఇంకా పలు విషయాలు తెలియాల్సి అవసరం ఉంది. ఉగ్రవాదులు తనను కిడ్నాప్ చేశారని సల్విందర్ సింగ్ చెబుతున్నా అతని మాటల్లో ఎంత వరకూ నిజం ఉంది? ఇంకా ఉగ్రవాదుల ముప్పు ఉందని అలర్ట్ చేసిన ప్రాంతానికి సల్విందర్ సింగ్ ఎందుకు వెళ్లారు.. ఇలాంటివి ఎన్నో ప్రశ్నలకు సల్విందర్ సింగ్ సమాధానాలు చెప్పాల్సి ఉంది. మరి ముందు ముందు విచారణలో ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి. మొత్తానికి ఇంటి దొంగను ఈశ్వరుడైన పసిగట్టలేడు అన్న చందాన మన ఇంటి దొంగను మనమే పట్టుకోలేనట్టయింది.