TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విమానంలో కుదుపులు.. ఇద్దరికి సీరియస్!

Published on: Thu Jul 17, 2014 2:12PM

 

రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు కుదుపులు వస్తే ఓకే.. అదే విమానంలో ప్రయాణిచేటప్పుడు కూడా కుదుపులు వస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ప్రయాణికుల ప్రాణాల మీదకి వస్తుంది. సౌతాఫ్రికాకి చెందిన ఒక విమానంలో ఇలాగే జరిగి ఇద్దరు ప్రయాణికుల ప్రాణాలు డేంజర్‌లో పడ్డాయి. సౌతాఫ్రికన్ ఎయిర్ వేస్‌‌కి చెందిన విమానం మలేసియా నుంచి హాంకాంగ్‌కి వెళ్తోంది. దారిలో విమానానికి ఏమైందోగానీ, తీవ్రమైన కుదుపులకు లోనైంది. విమానం సీట్లలో కూర్చుని వున్న ప్రయాణికులందరూ కిందపడిపోయారు. ఈ మూలన కూర్చున్న ప్రయాణికులు ఎగిరి ఆ మూలకు వెళ్ళి పడ్డారు. ఈ సంఘటనలో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది.