TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సార్ మీరే మాకు ఇన్స్పిరేషన్.. చంద్రబాబు కాంప్లిమెంట్స్ కు సోను సూద్ జవాబు 

Published on: Mon Jul 27, 2020 9:40AM

మన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలు కావడంతో మార్చ్ నెలలో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వలస కార్మికులు ఎక్కడి వాళ్ళు అక్కడ చిక్కుకు పోయి తమ స్వంత ఊళ్లకు చేరడానికి నానా అవస్థలు పడ్డారు. అటువంటి పరిస్థితుల్లో నటుడు సోనుసూద్ ముందుకు వచ్చి వలస కార్మికులకు అండగా నిలిచి కొందరిని బస్సులలో, మరి కొంత మందిని రైళ్లలో స్వస్థలాలకు పంపించారు. అంతే కాకుండా ఎవరు ఏ ప్రాంతం వారు అనే తేడా లేకుండా ఎవరికీ ఏ అవసరం ఉన్నా వెంటనే స్పందించి ఆదుకుంటున్నారు.

తాజాగా ఏపీలోని చిత్తూర్ జిల్లాకు చెందిన ఒక పేద రైతు కుటుంబం ఆర్ధిక సమస్యల కారణంగా కన్న కూతుళ్లు కాడి పట్టి నాగలి లాగుతుండగా వెనుక తల్లి, తండ్రి విత్తనాలు వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను ఎంతో మంది చూసి చలించిపోయారు. కానీ ఎవరు స్పందించలేదు. కానీ ఇదే వీడియోను చూసిన సోనుసూద్ మాత్రం ఆ పేద రైతుకు సాయం చేస్తానని ప్రకటించిన 24 గంటల్లోనే కొత్త ట్రాక్టర్ పంపించారు.

తాజాగా పేద రైతుకు సోనూసూద్ చేసిన సాయం పై ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ప్రశంసిస్తూ ఇది అందరికి  స్ఫూర్తిదాయకమని అన్నారు. అంతే కాకుండా దళిత పేద రైతు అయిన నాగేశ్వరరావు కుమార్తెల చదువుల బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు చేసిన ఈ ప్రశంసకు సోనూసూద్ మీరు మాకు స్ఫూర్తి అంటూ రిప్లై ఇచ్చారు. అంతే కాకుండా త్వరలోనే మిమ్మల్ని కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నానని అయన అన్నారు.