TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇంకా విశ్వసిస్తున్నాం: కెకె

Published on: Sun Dec 18, 2011 11:47AM

హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ హామీ ఇచ్చారు కాబట్టే కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇస్తుందని తాము ఇంకా విశ్వసిస్తున్నామని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు  తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. రాజ్యసభలో తెలంగాణ అంశం చర్చకు రాకుండా అడ్డుకున్నంతమాత్రాన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తొలగించలేరని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు.తెలంగాణ కోసం 700 మంది చనిపోతే, పార్లమెంటు గానీ, శాసనసభ గానీ వారి కోసం ఒక్క తీర్మానం కూడా చేయకపోవడం బాధాకరం అన్నారు.తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అనుకూలమని గతంలో ప్రకటించినదానికే కట్టుబడి ఉండాలని అధిష్టానవర్గాన్ని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అవసరం లేదని తాము ఎప్పుడో చెప్పామన్నారు. తెలంగాణపై అన్నీ తెలిసే కేంద్ర హోంమంత్రి చిదంబరం 2009 డిసెంబర్ 9న పార్లమెంటులో ప్రకటన చేశారని చెప్పారు. పార్లమెంటులో శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టక పోవడంపై తాను సిగ్గుతో తలదించుకుంటున్నానన్నారు. తెలంగాణపై చర్చ జరగకుండానే రాజ్యసభ వాయిదా పడటం తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. చర్చ జరగకుండా సభ వాయిదా పడినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదన్నారు.

ఎస్ఆర్సి, ప్రాంతీయ అభివృద్ధి మండలి, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం వంటి ప్రత్యామ్నాయాలను వేటినీ ప్రజలు అంగీకరించరని ఆయన చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం తప్ప మరేదీ ఆమోదనీయం కాదని స్పష్టం చేశారు.తెలంగాణ మంత్రులు ఈ నెల 19, 20 తేదీలలో తెలంగాణ అంశంపై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వస్తారని చెప్పారు. వారితోపాటు ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు.తెలంగాణ కోసం అన్ని మార్గాల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. రెండో ఎస్సార్సీ, అభివృద్ధి మండలి కేవలం ఊహాగానాలేనని, రాష్ట్రం తప్ప తెలంగాణ ప్రజలు దేనిని ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. తాము నిత్యం అధిష్టానంతో టచ్‌లో ఉన్నామని చెప్పారు. తెలంగాణ కాంగ్రెసు నేతలమంతా ఏకత్రాటిపై ఉన్నామని, మా మధ్య ఎలాంటి అభిప్రాయబేధాలు లేవన్నారు.