TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ ప్లీనరీలో కీలక చర్చకు సోనియా, రాహుల్ దూరం!

Published on: Fri Feb 24, 2023 9:15AM

కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది. నిజంగానే గాంధీ కుటుంబం పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను పార్టీకి వదిలేసి దూరంగా ఉంటున్నారు. అంటే రాజకీయ వర్గాలలో మాత్రం ఔననే సమాధానం వస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయి నుంచీ ప్రక్షాళన చేసి.. క్యాడర్ ను మరింత క్రియాశీలంగా మార్చాలన్న నిర్ణయంతో ఉంది. అందుకు ఆ పార్టీ మాజీ అధ్యక్షులు  సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పూర్తిగా సహకారం అందిస్తున్నారు.

పార్టీ తమ ప్రమేయం లేకుండానే స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేందుకు వీలు కల్పిస్తూ కీలక సమావేశాలు, నిర్ణయాలలో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉంటున్నారు. అలా అని పార్టీని పూర్తిగా గాలికి వదిలేశారా అంటే అదేం లేదు. కాంగ్రెస్ లో ప్రస్తుతం కనిపిస్తున్న జోష్ కు, విజయంపై పెరిగిన విశ్వాసానికి రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర ప్రధాన కారణమనడంలో సందేహం లేదు. ఇలా ఉండగా కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం (ఫిబ్రవరి 24) నుంచి మూడు రోజుల పాటు ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ వేదికగా జరుగుతాయి.

ఏఐసీపీ అధ్యక్షడు మల్లికార్జున్ ఖర్గే ఈ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశాలలో మొత్తం 6 తీర్మానాలను పార్టీ ఆమోదిస్తుంది. ముఖ్యంగా సీడబ్ల్యుసీకి ఎన్నికల నిర్వహణపై స్టీరింగ్ కమిటీ చర్చిస్తుంది. అయతే ఈ చర్చకు పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దూరంగా ఉంటారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పూర్తి స్వేచ్ఛను, స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఇచ్చేందుకే వారీ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.